హల్దీరామ్‌లో మైనారిటీ వాటా కోసం పెప్సికో చర్చలు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ విషయంతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటికే ప్రపంచ పెట్టుబడి సంస్థలైన టెమాసెక్, ఆల్ఫావేస్ గ్లోబల్ ఈ రేసులో ఉన్నాయి. తాజాగా పెప్సికో కూడా ఎంట్రీ ఇచ్చింది. హల్దీరామ్ కంపెనీలో 10-15 శాతం వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతూ టమాసెక్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ గత నెలలోనే బైండింగ్ ఆఫర్లు సమర్పించాయి. తాజాగా పెప్సికో హల్దీరామ్‌లో పెద్దఎత్తున వాటా కొనుగోలుకు ఆసక్తి చూపుతుందని తెలుస్తోంది. దీనికోసం చర్చల్ని ప్రారంభించింది. కానీ అవి ఇంకా ప్రారంభదశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం హల్దీరామ్ విలువను రూ.85,000-90,000 కోట్లు లెక్కగట్టినట్లు తెలుస్తోంది. చర్చల అనంతరం తుది ఆఫర్ వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. హల్డీరామ్ స్నాక్స్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. నమ్కీన్, స్వీట్లు, రెడీ టు ఈట్ ఫుడ్ ఐటమ్స్, ప్రీ- మిక్స్డ్ ఫుడ్ ఐటమ్స్‌తో సహా 500 రకాల ఉత్పత్తులను అందిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.12,800 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక లేస్, కుర్కురే వంటి బ్రాండ్‌లతో పాశ్చాత్య దేశాల స్నాక్స్ మార్కెట్లో 24 శాతం మార్కెట్ వాటాతో పెప్సికో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే నమ్కీన్, భుజియా వంటి సంప్రదాయ భారతీయ స్నాక్స్‌లో ఉనికి అంతంతమాత్రమే ఉంది. దీంతో భారత్‌లో తన స్నాక్స్ మార్కెట్‌ని విస్తరించే పనిలో పడింది. ఇక హల్దీరామ్ కొనుగోలు జరిగితే దేశీయ స్నాక్స్ విభాగంలో రాణించాలని చూస్తోంది.
హల్దీరామ్ వాటా కొనుగోలు రేసులో పెప్సికో, టెమాసెక్, ఆల్ఫావేస్ గ్లోబల్ !
January 15, 2025
0
Tags