ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఎత్తివేత !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఎత్తివేశారు. అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పుల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా  ప్రకటించారు. సెకండియర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి విలువైన సలహాలు సూచనలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడిట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్‌గా నిర్వహిస్తాయని కృతికా శుక్లా  క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ మొదటి సంవత్సరం అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)