హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీ మార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ అధికారులకు రెస్టారెంట్ యాజమాన్యం సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రెస్టారెంట్ లో ఉన్న ఫర్నీచర్ చాలా వరకు కాలిపోయిందని హోటల్ యాజమాన్యం తెలిపింది. అగ్ని ప్రమాదం కారణంగా ఆ చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కథనాలు వస్తున్నాయి.
మాదాపూర్‌లోని కృష్ణ కిచెన్ రెస్టారెంట్ లో భారీ అగ్ని ప్రమాదం
January 08, 2025
0
Tags