ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టు లాయర్ బి. బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది విచారణ చేపట్టారు. సీబీఐకి కేసుల బదలాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని, దీనిపై ఒక్క మాట ఏమైనా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది సూచించారు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై ఏడు సీఐడీ కేసులు నమోదయ్యాయి. పిటిషనర్ బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ లాయర్ మణిందర్ సింగ్ ఓకే చేయడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు సీనియర్ లాయర్ అయిన మీలాంటి వ్యక్తి వాదించడానికి హాజరవుతారని అసలు ఊహించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై పలు కేసు నమోదు కాగా, అప్పటికప్పుడు నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఏడు వారాలకు పైగా జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ రావడంతో విడుదలయ్యారు.
చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు !
January 28, 2025
0
Tags