ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ కాలాన్ని క్రమబద్ధీకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో జగన్‌ ప్రభుత్వం రెండు సార్లు ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. రెండోసారి 2022 జూన్‌ 28 నుంచి 2024 మే 30 వరకు సస్పెన్షన్‌ విధించింది. తాజాగా ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్‌ కాలంలో ఏబీవీకి ఇవ్వాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ వేటు పడకపోతే ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాలని ఆదేశించింది. ఏబీవీపై నమోదు చేసిన అభియోగాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)