అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించేలా సోమవారం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పనరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలోఉంది. ట్రంప్ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే.. దానిని భర్తీ చేసుకొనేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు. ''అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళుతున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు, మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను'' అని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు.
అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు !
January 28, 2025
0
Tags