విప్రో కంపెనీ ఆఫర్ చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ కావడం విశేషం. అభ్యర్థులు ఫుల్‌టైమ్ లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ లేదా నాలుగేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్స్ అర్హులు. అభ్యర్థులు తప్పకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మల్టిపుల్ లొకేషన్ల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. కొన్ని పోస్టులకు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్‌లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఉద్యోగంలో చేరాక శాలరీ, అలవెన్సులు ఎలా ఉంటాయనేది కంపెనీ పేర్కొనలేదు. టెక్నికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్‌ని ప్రధానంగా విప్రో కంపెనీ పరీక్షిస్తుంది. హైరింగ్ ప్రాసెస్‌లో వివిధ దశలు ఉంటాయి. రెజ్యూమ్, అవసరమైన డీటైల్స్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి. తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ స్కిల్స్‌ని అంచనా వేస్తారు. మూడో రౌండ్‌లో ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ మొదలైన వాటికి సంబంధించిన అసెస్‌మెంట్స్ ఉంటాయి. చివరిగా టెక్నికల్, హెచ్ ఆర్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫైనల్ సెలక్షన్ టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, విప్రో కోర్ వ్యాల్యూస్‌తో అభ్యర్థి ఎంత వరకు సరిపోతాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
విప్రో కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ !
January 31, 2025
0
Tags