అప్పుల బాధ తట్టుకోలేక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి (39) ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం గుండ్ల పోచంపల్లిలో బిల్డర్ ఓ నిర్మాణం మొదలు పెట్టాడు. నిర్మాణానికి పలు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాడు. అపార్ట్మెంట్లో  10 పాట్లు అమ్మితే అప్పులన్నీ తీరిపోతాయని అనుకున్నాడు. నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు మూడు మాత్రమే అమ్ముడు పోయాయి. మిగతా ఫ్లాట్లు అమ్ముడు పోకపోవడంతో మస్థాపానికి గురైన బిల్డర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు తీర్చలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)