అధ్యక్ష ఎన్నికల పోటీల్లో తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడినని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో 'ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిర్ణయంపై విచారిస్తున్నారా? మీ నిర్ణయం ట్రంప్ గెలుపుకు దోహదపడిందని మీరు అనుకుంటున్నారా ? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి అధ్యక్షుడు బదులిస్తూ.. తాను అలా ఏమీ అనుకోవడం లేదన్నారు. తాను మొన్నటి ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓండిచేవాడినని విశ్వాసం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు బైడెన్ స్పష్టం చేశారు. ట్రంప్‌ను కమలా హారిస్ ఓడించగలదని తాను భావించినట్లు చెప్పారు. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు మద్దతిచ్చినట్లు బైడెన్ చెప్పుకొచ్చారు. అందుకు కమలా సైతం తీవ్రంగా కృషి చేసినట్లు బైడెన్ వివరించారు.
తాను నిలబడి ఉంటే ట్రంప్‌ను ఓడించేవాడిని : జో బైడెన్
January 11, 2025
0
Tags