కేజ్రీవాల్ ఉచితాలను ఇస్తున్నారని భాజపా పదే పదే చెబుతోంది. కానీ, ఢిల్లీ ప్రజలకు ఉచితాలను అందజేస్తామని భాజపా జాతీయాధ్యక్షుడు నేడు ప్రకటించారు. ప్రధాని తమపై చేసిన వాదనలు తప్పని అంగీకరించాలి అని భాజపా మేనిఫెస్టోపై ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. భాజపా మేనిఫెస్టోను జేపీ నడ్డా ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడారు. తాము అమలు చేస్తున్న పథకాలనే కాషాయ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అలాంటప్పుడు వారికెందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలకు సంబంధించి ఎటువంటి హామీలు భాజపా ఇవ్వలేదన్న విమర్శించారు. ఆ మేనిఫెస్టోను అబద్ధాల పుట్టగా పేర్కొన్నారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని భాజపా చెబుతోందని మాజీ సీఎం ఆరోపించారు. ఇదిలా ఉంటే, 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో భాజపా విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోలో.. గర్భిణిలకు రూ.21వేల ఆర్థిక సాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై రూ.500కే ఎల్పీజీ (LPG subsidy) సిలిండర్లు, 'మహిళా సమృద్ధి యోజన' కింద దిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాము అమలు చేస్తున్న పథకాలనే కాషాయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది : కేజ్రీవాల్ !
January 17, 2025
0
Tags