ఇండియన్ రైల్వేస్‌ కొత్త యాప్ రైలోఫీ !

Telugu Lo Computer
0


భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైలోఫీ అనే కొత్త అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులు తమ రైలు ప్రయాణం వివరాలను రియల్ టైమ్‌లో వాట్సాప్‌లో పొందవచ్చు. పీఎన్‌ఆర్‌ స్థితి, రైలు సమయాలు, స్టేషన్ హెచ్చరికలు వంటి వివరాలను త్వరగా తెలుసుకోవచ్చు. ప్రయాణీకులు 139 నంబరును డయల్ చేసి తమ రైలు స్టేటస్‌ను తెలుసుకునే వలె, రైల్వే హెల్ప్‌లైన్ ద్వారా వారి ప్రయాణం గురించి లైవ్ అప్‌డేట్‌లు పొందగలుగుతారు. రైలోఫీ యాప్ ద్వారా ఇది మరింత సులభంగా వాట్సాప్‌లో పొందవచ్చు. ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌ను వన్‌టూ వన్‌ సర్వీస్ ద్వారా మెసేజ్‌ చేసి, వారి ప్రయాణానికి సంబంధించి తక్షణ సమాచారాన్ని పొందవచ్చు. రైలు సమయాలు, స్టేషన్ సమాచారం తెలుసుకోవడం. ఆపద సమయంలో సహాయం, ట్రైన్ వాయిదాలు లేదా రద్దు సమయంలో సహాయం. మిస్సింగ్ వస్తువుల కోసం సమాచారం. టికెట్ సమస్యలపై సహాయం. ప్రయాణానికి సురక్షితమైన మార్గదర్శకాలు. ఈ కొత్త సాంకేతికత ద్వారా రైలు ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)