మహారాష్ట్రలోని జల్గావ్‌లో బుధవారం సాయంత్రం లక్నో నుంచి ముంబై వెళ్తున్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురై కదులుతున్న రైలు నుంచి దూకారు. ఆ సమయంలోనే పక్కన ఉన్న ట్రాక్‌పై కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వస్తోంది. రైలు నుంచి దూకిన ప్రయాణికులను కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢి కొట్టింది. జల్గావ్‌లోని పచోరా తహసీల్‌లోని పర్ధాడే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 7 నుంచి 8 మంది మృతి చెందినట్లు జిల్లా మేజిస్ట్రేట్ తెలియజేశారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ముంబై సిఎస్‌టి వైపు వెళ్తుంది. రైలు పచోరా రైల్వే స్టేషన్‌లో పార్క్ చేసి వుంది.. ఆ సమయంలో రైలులోని బి4 బోగీలో మంటలు చెలరేగాయని.. ఆ తర్వాత రైలులో మంటలు వ్యాపించాయని చెబుతున్నారు. ఒక సీనియర్ రైల్వే అధికారి పిటిఐతో మాట్లాడుతూ.. 'హాట్ యాక్సిల్' లేదా 'బ్రేక్-బైండింగ్' (జామింగ్) పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లోపల స్పార్క్‌కు కారణమైంది.. ఇది కొంతమంది ప్రయాణికులను భయానికి గురిచేసింది. చైన్ లాగి కొందరు పట్టాలపై నుంచి కిందకు దూకారు. అదే సమయంలో పక్కనే ఉన్న ట్రాక్‌పై నుంచి మరో రైలు వెళ్తోందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు దుర్మరణం
January 22, 2025
0
Tags