కుంభమేళా ఘాట్‌ల వద్ద గంగా హారతి నిలిపివేత !

Telugu Lo Computer
0

మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. కోట్లాదిగా తరలివస్తుండటంతో నెలకొన్న రద్దీ దృష్ట్యా కొన్ని రోజుల పాటు ఘాట్‌ల వద్ద గంగా హారతి కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 వరకు వారణాసిలోని దశాశ్వమేధ్, శీత్ల, అస్సీ మొదలైన ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతిని నిలివేస్తున్నామని.. స్థానిక ప్రజలు అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీస్‌ కమిషనర్ మోహిత్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు. ఘాట్‌ల వద్ద ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన భక్తులు వారణాసికి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో కొందరు ప్రయాణికులు వారణాసి, బనారస్ రైల్వే స్టేషన్‌లలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయని తెలిపారు. మౌని అమావాస్య నుంచి కాశీలో భక్తుల రద్దీ పెరిగిందని.. వారి సంఖ్య తగ్గేవరకు ఇతరులు ఎవరూ వారణాసికి రావద్దని విజ్ఞప్తి చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)