ఆంధ్రప్రదేశ్ లోని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి, ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. జేసీ వ్యవహరించిన తీరుతో తన కుటుంబ సభ్యులు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. సీనియర్ రాజకీయ నాయకుడైన జేసీ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు మాధవీలత ఫిర్యాదు
January 21, 2025
0
Tags