28 పరీక్షా కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరిగినా ప్రభుత్వం అంగీకరించేందుకు సిద్ధంగా లేదు : రాహుల్‌ గాంధీ

Telugu Lo Computer
0


పేపర్‌ లీక్‌లను యువత హక్కులను కాలరాసే ఆయుధంగా కాషాయ పార్టీ మార్చుకుందని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనలు చేపట్టిన బీపీఎస్‌సీ అభ్యర్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. అభ్యర్థులను కలిసినప్పుడు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. పేపర్ లీక్‌ అయితే కచ్చితంగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం అభ్యర్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దాడికి యత్నించారు. బాధితులపై కేసులు పెట్టారని రాహుల్‌ గాంధీ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో పోస్టు పెట్టారు. 28 పరీక్షా కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరిగినా ప్రభుత్వం ఇంకా అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. ఇది కేవలం బీహార్‌కు సంబంధించిన సమస్య కాదు. యావత్‌ దేశానికి చెందిన సమస్య. అభ్యర్థుల నిరసనల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని హామీ ఇచ్చారు.  గతేడాది డిసెంబర్‌ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)