మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన నితీష్ కుమార్ రెడ్డి : వీడియో వైరల్ !

Telugu Lo Computer
0


కాలినడకన తిరుమల కొండపైకి వెళ్లిన క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇవాళ తెల్లవారు జామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఎంత ఎదిగినా తమ మూలాలను మర్చిపోవద్దని, తమ భక్తిని నిర్భయంగా చూపించనందుకు ధన్యవాదాలని పలువురు కామెంట్ చేస్తున్నారు. నితీశ్ కుమార్‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేశాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు.. మెల్‌బోర్న్‌ టెస్టులో జట్టును ఫాల్ ఆన్‌ గండం నుంచి బయటపడేశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ అంతా పేలవ ప్రదర్శన కనబర్చినా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తన తొలి సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటిన నితీశ్ తన స్వస్థలమైన విశాఖకు చేరుకున్నప్పుడు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్‌ టాప్‌ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు.

Post a Comment

0Comments

Post a Comment (0)