ఐర్లాండ్ మహిళల జట్టుతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుతం చేసింది. ఐర్లాండ్‌ను భారీ తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. 304 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 436 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలిపోయింది. సారా (41), ఓర్లా (36) మాత్రం కాస్త రాణించారు. టీమిండియా బౌలర్లలో తనూజా 2, దీప్తి 3, సయాలీ 1, సాధు 1, మిన్ను మని 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 435/5 రికార్డు స్కోరు చేసింది. ప్రతికా రావల్ (154), స్మృతీ మంధాన (135) సెంచరీలతో అద్భుత ప్రదర్శన చేశారు. పరుగుల పరంగా చూసుకుంటే టీమిండియా అత్యధిక తేడాతో విజయం సాధించిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. అంతకుముందు ఐర్లాండ్‌పైనే 2017లో ఏకంగా 249 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.
304 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై టీమిండియా అద్భుత విజయం : వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
January 15, 2025
0
Tags