ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామం పందెం కోళ్లకు ప్రసిద్ధి. ముఖ్యంగా రత్తయ్య అనే వ్యక్తి పెంచే కోళ్లకు మరింత డిమాండ్. ఆయన పెంచే కోళ్లను కొనడానికి దూర దూర ప్రాంతాల నుంచి వ్యక్తులు వస్తుంటారు. గతంలో థాయిలాండ్ నుంచి కూడా కోళ్లను కొనుగోలు చేయడానికి వచ్చారు. 2023లో గణపవరంలో జరిగిన కోడి పందెంలో రత్తయ్య పెంచిన కోడి భారీ మొత్తంలో అమ్ముడుపోయింది. అయితే ఈ ఏడాది జరిగిన కోడి పందెంలో ఆయన కోడి ఓడిపోయింది. ఈ పందెం కోసం దాదాపు రూ. 20 లక్షలు పందెం వేశారు. కానీ, రత్తయ్య కోడి కనీసం పోటీ ఇవ్వకుండానే కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ కోడి పందెం ద్వారా దాదాపు రూ. 20 లక్షలు మారిపోయాయి.
కోడి పందెంలో రెప్పపాటులో 20 లక్షలు హాంఫట్ : వీడియో వైరల్
January 15, 2025
0
Tags