మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఎఫ్‌జెడ్‌ఎస్ ఎఫ్‌ఐని ఆవిష్కరించిన యమహా

Telugu Lo Computer
0


మహా 1980,90 ల కాలంలో భారత రోడ్లను శాసించిన యూత్ ఫేవరెట్ బైక్స్ RX100, RD350 మోడళ్లను వాహన ప్రియులకు అందుబాటులో ఉంచడంతో పాటు యమహా FZ సిరీస్, YZF R15 బైకులకు సంబంధించిన మొదటి తరం మోడళ్లను మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రదర్శించింది. ఇవన్నీ కూడా ఐకానిక్ హెరిటేజ్ బైక్స్. అయితే వీటితో పాటు హైబ్రిడ్ టెక్నాలజీతో దేశీయ మొదటి 150సీసీ కమ్యూటర్ బైక్ ఎఫ్‌జెడ్‌ఎస్ ఎఫ్‌ఐ(FZ-S Fi)ని ఆవిష్కరించింది. ఇది ఆటో ఎక్స్‌పోలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రే ZR, ఫాసినో మోడళ్ల తరువాత ఈ హైబ్రిడ్ బైక్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. యమహా ఎఫ్‌జెడ్‌ఎస్ ఎఫ్‌ఐ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG)తో వస్తుంది, దీంతో ఇంజిన్‌ మరింత గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. ఈ టెక్నాలజి చిన్న పవర్ బూస్ట్‌గా ఉపయోగపడుతుంది. ఈ బైకులో రైడర్స్ సౌకర్యం కోసం సైలెంట్ స్టార్ట్, స్టార్ట్/స్టాప్ టెక్ వంటి వాటిని అందించారు. ఇది ఎయిర్-కూల్డ్, 149 సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. 12.4 hp పవర్, 13.3 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీ కాబట్టి ఇంజిన్ పెర్ఫామెన్స్ మెరుగ్గా ఉంటుంది. బైక్ మైలేజ్ కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి యమహా తన వంతు సహకరంగా ఈ బైకులో లేటెస్ట్ సాంకేతికత వాడటంతో కాలుష్య ఉద్గారాలు తక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. ఈ ఇంజిన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను జోడించారు. దీని డిజైన్ కొత్తగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దీనిలో లేటెస్ట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. కాల్/నోటిఫికేషన్ అలర్ట్, TFT డిస్‌ప్లే, మ్యూజిక్ కంట్రోల్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. అలాగే, సస్పెన్షన్ సెటప్ విషయానికి చూస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ సస్పెన్షన్ అందించారు. రైడింగ్ సమయంలో బైక్ స్కిడ్ కాకుండా నెమ్మదిగా కంట్రోల్ చేయడానికి డిస్క్ బ్రేక్ సెటప్ ఉంది. ఎఫ్‌జెడ్‌ఎస్ ఎఫ్‌ఐ హైబ్రిడ్ బైకులో ముందు 282mm డిస్క్, వెనుక 220mm డిస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ కూడా బైకుకు ప్రధాన ఆకర్షణ.

Post a Comment

0Comments

Post a Comment (0)