గత ఏడాదిలో 1,72,808 మారుతీ సుజుకీ స్విఫ్ట్ కార్లు అమ్మకం !

Telugu Lo Computer
0


గత ఏడాదిలో మారుతీ సుజుకీ  వాహనాల అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. ఏడాది ముగిసి కొత్త ఏడాది ప్రారంభం అయిన నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు వరుసగా 2024లో కార్ల విక్రయాలకు సంబంధించిన వివరాలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మారుతీ సుజుకీ కూడా తన ఫేవరెట్ మోడల్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారుకు సేల్స్ వివరాలను తాజాగా వెల్లడించింది. డేటా ప్రకారం, 2024 ఏడాదిలో మారుతీ సుజుకీ స్విఫ్ట్ మొత్తం 1,72,808 కార్లు అమ్ముడుపోయాయి. దీంతో ఇండియాలో అత్యధికంగా విక్రయించిన టాప్ 10 కార్ల లిస్ట్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ 6వ స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో ఈ కారుకు డిమాండ్ భారీగా రావడంపై మారుతీ సుజుకీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ హ్యాచ్‌బ్యాక్ ఇండియా మార్కెట్లో చాలా కాలంగా అమ్మకానికి అందుబాటులో ఉంది. దేశీయ మార్కెట్లోకి పలు కార్ల తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నప్పటికీ కూడా మారుతీ స్విఫ్ట్ కారుకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. 2024 ఏడాదిలో మొత్తం అమ్మకాల్లో 6 వ స్థానంలో నిలవగా దీనికి ముందు టాటా పంచ్ అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంది. తరువాత రెండో స్థానంలో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్, ఎర్టిగా, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్ చాలా కాలంగా మార్కెట్లో కొనుగోలుకు ఉంది. అయితే దీనికి డిమాండ్ భారీగా ఉండటంతో కంపెనీ స్విఫ్ట్‌లో కొత్త తరం మోడల్‌ను మే 2024 ప్రారంభంలో లాంచ్ చేసింది. దీంతో దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్స్‌కు చాలా మంది కస్టమర్లు ఫిదా అయ దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ రూ.6.49 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అదే టాప్ వేరియంట్ రూ.9.60 లక్షలకు లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. దీని ఇంజిన్ విషయానికి వస్తే, 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ అలాగే, cng ఇంజిన్‌ ఆప్షన్లలో కొనుగోలుకు ఉంది. దీని ధర దాదాపు రూ.8.20 లక్షల నుంచి ఉంటుంది. మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తున్న స్విఫ్ట్‌ మైలేజ్ కూడా మెరుగ్గానే వస్తుంది. పెట్రోల్ మోడల్‌లో 24.80 కి.మీల మైలేజ్, cng ఆప్షన్‌లో 32.85 కి.మీల మైలేజ్ ఇస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. కారులో చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంటర్‌టైన్ మెంట్ కోసం ఆర్కామిస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, , ఆటో క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కి 265 లీటర్ల బూట్ స్పేస్‌, వంటి ప్రధాన ఫీచర్లు లోపల ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)