15 నిమిషాల్లో 11 లక్షల రూపాయలు లెక్కించి బోనస్ గా పొందిన ఉద్యోగి !

Telugu Lo Computer
0


చైనాలోని హెనాన్ మైనింగ్ క్రేన్ కో కంపెనీఉద్యోగులకు 70 కోట్ల రూపాయలు బోనస్ ప్రకటించింది. ఆఫీసులో పెద్ద టేబుల్ ఏర్పాటు చేసి 70 కోట్ల రూపాయల నోట్లను టేబుల్ పై పోసింది. ఉద్యోగులు అందర్నీ పిలిచి ఒక షరతు పెట్టింది.15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత డబ్బు బోనస్ గా తీసుకోవచ్చు అనే చెప్పింది. ఈ పోటీలో అత్యధికం11 లక్షల రూపాయలను ఓ ఉద్యోగి లెక్కించాడు. ఇదే అత్యధికం.  ఎక్కువ మంది ఉద్యోగులు 2 నుంచి 4 లక్షల రూపాయలు మాత్రమే లెక్కించారు. ఒకే ఒక్క ఉద్యోగి 15 నిమిషాల్లో 11 లక్షల రూపాయలు లెక్కించి బోనస్ పట్టుకెళ్లాడు..


Post a Comment

0Comments

Post a Comment (0)