హైదరాబాద్ లోని మీర్‌పేట్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన కోర్టు నిందితుడు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు గురుమూర్తికి కోర్టు రిమాండ్ విధించింది. పోలీసులు నిన్న అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ, నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా, బయటకు వస్తున్న విషయాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొన్నారు. ఎవరికైనా ఇలా చేసేందుకు ఎలా మనసొచ్చిందో అర్థంకావడం లేదు అని సుధీర్‌బాబు విచారం వ్యక్తం చేశారు.
మీర్‌పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు !
January 29, 2025
0
Tags