ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పీలేరు కూటమి బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొని తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. 'నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు' అని అన్నారు. ‘తిరుపతి వెంకన్న, అన్నమయ్య కు ప్రణామాలు. రాయలసీమ సహజసంపదకు నిలయం. ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి అని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని మాఫియాలకు ట్రీట్మెంట్ ఇస్తామని ప్రధాని మోడీ అన్నారు. ‘కేంద్ర పథకం జల్జీవన్ మిషన్ కు వైసీపీ ప్రభుత్వం సహకరించలేదు. ఇంటింటికీ పైప్ లైన్ ద్వారా నీళ్లు అందించాలనే లక్ష్యాన్ని నీరుగార్చింది అని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పోలవరం పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని అన్నారు. వైసీపీ మంత్రులు గూండాయిజం చేస్తున్నారు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)