జిలేబీ బాబా జైలులో మృతి !

Telugu Lo Computer
0


వివాదాస్పద ''జిలేబీ బాబా'' జైలులో మరణించాడు. 120 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసి, వారి అసభ్యకరమైన వీడియోలను తీసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడిన ఇతడు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. జిలేబీ బాబాని బిల్లూరామ్, అమర్‌పురి అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇతడు హర్యానాలోని హిసార్‌లోని సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు. షుగర్ పెషెంట్ అయిన ఇతని ఆరోగ్యం మంగళవారం క్షీణించింది. రాత్రి సమయంలో ఒంట్లో ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం బుధవారం అతడి అంత్యక్రియల్ని నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)