ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ జిల్లా ఖాన్పూర్ ప్రాంతంలో పార్క్ చేసిన మారుతీ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. సుమారు 20 నిమిషాలపాటు ఆ వాహనం కాలిపోయింది. అనంతరం పెట్రోల్ ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో ఆ వ్యాన్ గాల్లోకి ఎగిరి పడింది. కాగా, ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఆ వ్యాన్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాలో మాదిరిగా మంటల్లో కాలిన వ్యాన్ గాల్లోకి ఎగురడం చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. కాగా, వేసవి కాలంలో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.
పేలి గాల్లోకి ఎగిరిన వ్యాన్ !
May 09, 2024
0
Tags