బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్‌ఎస్సెఎస్‌ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని రాహుల్ ఆరోపించారు. దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేలాలన్నారు. ఒకసారి జనగణన చేస్తేనే.. ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. మోడీ గత పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలను విక్రయించారని రాహుల్ ఆరోపించారు. కేవలం 2 శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందని, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదన్నారు రాహుల్. పెట్టుబడిదారులకు బీజేపీ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు దళితులు ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ. 8500 చొప్పున ఏడాదికి రూ.లక్ష డిపాజిట్‌ చేస్తామన్నారు. బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులతో మహిళలు ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తారని, మహిళల కొనుగోలు శక్తి పెరగటంతో పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఉద్యోగా కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రాహుల్ ప్రజలను కోరారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)