'పద్మ విభూషణ్' అందుకున్న చిరంజీవి !

Telugu Lo Computer
0


ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గురువారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. సినీ పరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన, కుటుంబ సభ్యులు హాజరైనారు. రిపబ్లిక్ డే రోజు దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం 132 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఏప్రిల్ 22వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడితో పాటు పలువురికి రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు అందించారు. ఆ రోజు పద్మ అవార్డుల మొదటి విడత పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రం జరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)