గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ వాయిదా !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతరులు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా ఆదేశించాలని కోరుతూ తెదేపా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి నష్టపోతుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ దశలో ఇతర అభ్యర్థులకు కేటాయించిన సింబల్‌ను మార్చలేమని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎలక్ట్రానిక్‌ బ్యాలెట్‌ను ఇప్పటికే పంపించామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)