తిరుమలలో భారీ వర్షం !

Telugu Lo Computer
0


తిరుమల భారీ వర్షం కురిసింది. దానితో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాఢవీధుల చుట్టుపక్కల్లో ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. గురువారం ఉదయం నుంచి వాతావరణం కొంచెం చల్లగా ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. జోరు వాన పడింది. అర గంట పాటు ఆగకుండా వర్షం పడింది. నిన్నటి వరకు భగభగలాడిన సూర్యుడితో.. ఉక్కబోతతో అల్లాడిన తిరుమల క్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో భక్తులు ఉపశమనం పొందుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)