ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీ లోని ఆయన నివాసంలో విలేకర్లతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు గెలవబోతున్నట్లు చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసను అరికట్టడానికి కఠినంగా వ్యవహరించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్, డీజీపీలను పిలిపించినట్లు తెలిసిందని, హింసాత్మక ఘటనలను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. తెలంగాణలో మజ్లిస్ పార్టీ చిన్నచిన్న ఘటనలకు పాల్పడినా ప్రశాంతంగా ఎన్నికలు జరగడం సంతోషకరమన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మినహా దేశంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి అభ్యర్థులు నిరాశ నిస్పృహలకు లోనవడం వల్లే హింస చెలరేగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఇందులో ఎన్నికల సంఘం విఫలమైనట్లు చెప్పలేమన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే 400 సీట్లు దాటుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే !
May 16, 2024
0
Tags