అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై రెండవ సంతకం !

Telugu Lo Computer
0


తాము తిరిగి అదికారంలోకి వస్తే వివాదాస్పద భూహక్కు చట్టం రద్దు చేస్తామని ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ చంద్రబాబు మరింత స్పష్టత ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దుపైనే చేస్తామని ప్రకటించారు. చీరాలలో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు. ఇప్పటికే అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చి జగన్ సర్కార్ ప్రజల భూములు లాక్కుంటోందని చంద్రబాబు ఇవాళ ఆరోపించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయాలని చూడటం అన్యాయం అన్నారు. ఎకరాలకు ఎకరాలు రికార్డులు తారుమారు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆత్మహత్యలు కూడా ప్రారంభమయ్యాయని చంద్రబాబు విమర్శించారు. ఒంటిమిట్టలో రికార్డులు తారుమారు చేస్తే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం భూహక్కు చట్టంపై చేస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)