ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్టుతో దేశం దాటి వెళ్లినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతే తప్ప ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు వెళ్లేందుకు రాజకీయంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, తాము కూడా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వారాంతపు ప్రెస్‌మీట్‌లో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిది రంధిర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారంటూ వచ్చిన వార్తలపై మీడియా ప్రస్తావించగా.. ఈ విషయంలో తమకు రాజకీయంగా అలాంటి ఆదేశాలు రాలేదన్నారు. తాము కూడా ఎలాంటి వీసా జారీ చేయలేదన్నారు. దౌత్యపరమైన పాస్‌పోర్టుతో దేశం దాటారని, జర్మనీకి వెళ్లడానికి ఎలాంటి వీసా అవసరం లేదన్నారు. ఏ ఇతర దేశానికి వెళ్లేందుకూ తాము వీసా జారీ చేయలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాస్‌పోర్టును రద్దు చేస్తారా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. దానికి నేరుగా జైశ్వాల్ సమాధానం చెప్పలేదు. పాస్‌పోర్టు రద్దుకు నియామావళి ఉందని, అయినా ఏ కోర్టు నుంచీ తమకు సంబంధిత ఆదేశాలు రాలేదన్నారు.
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో జర్మనీకి వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ !
May 02, 2024
0
Tags