ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. వాస్తవానికి నేటితో ఈ గడువు ముగియగా విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాళాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా టీఎస్‌బీఐఈ ఖాతాకు అదే తేదీలోగా ఫీజులు చెల్లించాలని సూచించింది. తెలంగాణలో మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు మే 4 వరకు పొడిగింపు !
May 02, 2024
0
Tags