ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని ఒక జంక్షన్ కి అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ మేరకు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్ తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వి కపూర్, ఖుషి కపూర్ లు ఇంతకుముందు ఇదే ప్రాంతంలో నివసించారు. అయితే శ్రీదేవి మరణించిన తర్వాత వారి కుటుంబం అక్కడి నుంచి షిఫ్ట్ అయిందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె జ్ఞాపకార్ధం, ఆమెను గౌరవించాలని, ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉండేలా ఆమె పేరు జంక్షన్ కు పెట్టుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో అంధేరీ వెస్ట్ కు చెందిన నగర వాసులు పోస్టులు కూడా పెడుతున్నారు. తమ అభిమాన నటి శ్రీదేవికి శాశ్వతమైన గౌరవాన్ని ఇవ్వగలిగామని శ్రీదేవి లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని గ్రీన్ ఎకర్స్ టవర్ లో నివసించే వారనీ, ఆమె ఇంటికి వెళ్లే మార్గంలోనే ఈ చౌక్ ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో శ్రీదేవి జ్ఞాపకార్థం ముంబైలో ఒక ఫ్లైఓవర్ కి కూడా ఆమె పేరు పెట్టాలని బిజెపి కార్పొరేటర్ యోగిరాజ్ లేఖ రాశారు. అభినేత్రి శ్రీదేవి ఉదాన్ పూల్ పేరు ఫ్లైఓవర్ కి పేరు పెట్టాలని ఆయన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు లేఖ రాశారు. ప్రస్తుతం ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఒక జంక్షన్ కి ఫైనల్ గా శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు.
శ్రీదేవికి అరుదైన గౌరవం !
May 11, 2024
0
Tags