తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయి !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిశాయని, ఇక తన దృష్టి అంతా పరిపాలన పైనే అని తెలిపారు. బీఆర్ఎస్ ఎలక్షన్ ఎలా చేసిందనే దానిని బట్టి రిజల్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ చేశారు.ఎవరి ఓట్లు నేతలు తీసుకుంటే ఎలక్షన్ అంచనా వేయొచ్చని అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 20 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో దేశం మొత్తం మీద 210 ఎంపీ సీట్లు కూడా దాటేలా లేదన్నారు. రేపటి నుంచి పరిపాలనపై పూర్తిగా దృష్టి పెడుతామన్నారు. ధాన్యం కొనుగోలు రుణమాఫీపై దృష్టి పెడతామని వివరించారు. స్కూళ్లు ఓపెన్ అవుతాయి కాబట్టి వాటిపై దృష్టి పెడుతామని అన్నారు. రుణమాఫీ కోసం ఎఫ్ఆర్బీఎం( FRBM) పరిధిలో లోన్ తీసుకుంటామని చెప్పారు. ఇక రాజకీయం ముగిసిందని.. రాష్ట్రంలో తన దృష్టి పూర్తిగా పరిపాలనపైనే పెడుతానని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు ఏం అనుకున్న తాను పట్టించుకొనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ప్రతిపక్షాలు అన్నాయని.. ఇప్పుడు రైతు బంధు నిధులు వేశాక మా క్రెడిట్ అని చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీలో చర్చ చేసి ఏదైనా నిర్ణయం తీసుకుంటామని, లేదంటే అఖిలపక్షం పెడుతామని చెప్పారు. రేషన్ షాపుల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి పంచుతామని స్పష్టం చేశారు. సామాన్యులు కొనుగోలు చేసే 9 వస్తువులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇస్తామన్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ప్రజలకు ఇస్తామని మాటిచ్చారు. స్టేట్‌కు ఏం కావాలో వాటిని అమలు చేసేలా చూస్తామని అన్నారు. రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)