దుబాయ్ అరుదైన రికార్డును నెలకొల్పనుంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విమానాశ్రయ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే అభివృద్ధి దశలో ఉన్న 'దుబాయ్ వరల్డ్ సెంట్రల్' లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 35 బిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీలో రూ.2.9 లక్షల కోట్లతో కొత్త టెర్నినల్ నిర్మిచనున్నారు. ఈ నిర్మాణం పూరైతే ప్రస్తుత విమానాశ్రయం 5 రెట్లు మేర పెరగనుంది. వచ్చే పదేళ్లలో కార్యకలాపాలను అక్కడ నుంచే సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయాన్ని దుబాయ్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదివారం ప్రకటించారు. ఇక ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తైతే అరుదైన రికార్డును క్రియోట్ చేస్తుంది. అది ఏమిటంటే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలవనుంది. కొత్తగా నిర్మాణం చేయనున్న టెర్మినల్‌ను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానశ్రయంగా పిలుస్తారు. ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నామని దుబాయ్ అధ్యక్షుడు ఆదివారం ఓ వీడియో ప్రకటను విడుదల చేశారు. ఏటా 26 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఈ విమానాశ్రయం అభివృద్ధి చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ కొత్త టెర్నినల్ లో మొత్తం 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్లు, ఐదు సమాంతర రన్‌వేలతో సరికొత్త టెక్నాలజిని వినియోగించనున్నామని వివరించారు. లక్షలాది మంది నివాసం ఉండే అవకాశం ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి, ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. అదే విధంగా లాజిస్టిక్, ఎయిర్‌పోర్టు రంగంలో అతిపెద్ద సంస్థలకు ఇది కేంద్రంగా మారనుంది.
దుబాయ్ లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్ నిర్మాణం !
April 29, 2024
0
Tags