నవీన్‌కుమార్‌ రెడ్డికి కేసీఆర్‌ బీఫారం అందజేత !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగర్‌కుంట నవీన్‌కుమార్‌ రెడ్డికి భారత్‌ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీ ఫారం అందజేశారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్‌ కుమార్‌ రెడ్డిని కేసీఆర్‌ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవీన్‌ కుమార్‌ స్వస్థలం నందిగామ మండలం మామిడిపల్లి. ఆయన ఉమ్మడి పాలమూరు జడ్పీ వైస్‌ చైర్మన్‌గా సేవలందించారు. స్థానిక సంస్థల కోటాలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 4న నోటిఫికేషన్‌ వెలువడగా.. ఈ నెల 28న పోలింగ్‌ జరుగనున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)