పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడకు ఈసీ షోకాజ్‌ నోటీసు !

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన పలమనేరు వైకాపా ఎమ్మెల్యే వెంకట గౌడపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో వైకాపా నేతల ఎన్నికల కోడ్ ఉల్లంఘన తారస్థాయికి చేరింది. పదో తరగతి పిల్లలకు పలమనేరు ఎమ్మెల్యే సోమవారం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. చాలామంది విద్యార్థులు వాటితోనే పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. దీనిపై తెదేపా నేతలు పలమనేరు ఆర్డీఓ కు ఫిర్యాదు చేయగకచ్చితంగా అది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి చెప్పారు. పరీక్ష కేంద్రంలోనికి వాటిని అనుమతించరాదని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)