జాతీయ ఉపాధి హామీ పథకం వేతనాలు పెంపు ?

Telugu Lo Computer
0


జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఉపాధి లభిస్తోంది. అర్హులైన వారందరికీ వంద రోజుల ఉపాధి దీని ద్వారా లభిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఉపాధి కూలీలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పలు మార్లు వేతనాల పెంపు గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే ఉపాధి కూలీల వేతనాలను పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉన్నందున కూలీల వేతనాల పెంపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కేంద్రం ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని ప్రభుత్వం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘం అనుమతి చెప్పడంతో ఏప్రిల్ 1 నుంచి వేతనాలు పెరగబోతున్నాయి. అయితే ఈ పథకం లో భాగంగా పెంచిన వేతనాలను ఎన్నికల్లో ప్రచారం చేసుకోవద్దని ఈసీ కోరింది. 2005లో అప్పటి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీ విధానాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)