మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టిడిపికి రాజీనామా చేశారు. గత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. అరకు ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల అనంతరం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగినా.. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కిషోర్ చంద్రదేవ్.. కేంద్ర మంత్రిగా కూడా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. దీంతో గత ఎన్నికల్లో టిడిపిలో చేరి ఎంపీ అవుదామని భావించారు. కానీ వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అవుతున్న వేళ కిషోర్ టిడిపిని వీడడం ప్రాధాన్యత సంతరించుకుంది. టిడిపి ఎన్ డి ఏ కు దగ్గర కావడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కిషోర్ చంద్రదేవ్ ప్రకటించారు.
టీడీపీకి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా
February 15, 2024
0
Tags