టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా ?

Telugu Lo Computer
0


తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన తొలి జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో సీటు దక్కని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనకు సటు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న నేతలు.. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడేందుకు రెడి అయినట్టు తెలుస్తోంది. రాజోలు అసెంబ్లీ ఆశించిన ఆయన టికెట్ కేటాయించలేదని అసంతృప్తితో పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నారట!. గొల్లపల్లి సూర్యారావు ఇంటివద్ద గతంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించారు అనుచరులు. ఆ తరువాత రాజోలు నుంచి తాడేపల్లికి బయలు దేరి వెళ్లారట గొల్లపల్లి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో ఇవాళ లేదా రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)