తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నియామకమయ్యారు. చైర్మన్‌తో పాటు మరో ముగ్గురిని బోర్డు సభ్యులుగా గవర్నర్ నియమించారు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ బోర్డు సభ్యులుగా సంకేపల్లీ సుధీర్ రెడ్డి, మల్కుడ్ రమేష్, నెహ్రూ నాయక్ మల్హోత్ నియామకమయ్యారు. రెండేళ్ల పాటు వీరు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు గవర్నర్ తమిళి సై శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కార్పొరేషన్‌లను రద్దు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన పలు నామినేటేడ్ పోస్టులకు కొందరు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవికి భూపాల్ రెడ్డి రాజీనామా చేశారు. భూపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా గవర్నర్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
February 16, 2024
0
Tags