ఆరు నెలల్లో సీఎం రేవంత్‌ రెడ్డికి శిక్ష పడటం ఖాయం !

Telugu Lo Computer
0


టుకు నోటు కేసు ట్రయల్‌ పూర్తయిందని, మరో ఆరు నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డికి శిక్షణ పడటం ఖాయమని హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. కేసీఆర్‌ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. ఉద్యోగాల భర్తీ కోసం ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చారు? భర్తీ ఎప్పుడు జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పాడి కౌశిక్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేండ్లు పని చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ కోరుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి రివర్స్‌ అయ్యే అవకాశం ఉందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఏక్‌నాథ్‌ షిండే అయ్యేది రేవంత్‌ రెడ్డి అని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి పాథలాజికల్‌ లయ్యర్‌ అని విమర్శించారు. ప్రతి నిత్యం అబద్ధాలు ఆడటమే పనిగా పెట్టుకునే వాడిని పాథలాజికల్‌ లయ్యర్‌ అని అంటారని వివరించారు. రోగ లక్షణ అబద్ధాల కోరు అని అర్థమని అన్నారు. తమ నేత హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)