హైదరాబాద్ నగరంలోని బొల్లారంలో గురువారం తెల్లవారుజామున ఓ వైద్యుడు వేగంగా కారు నడుపుతూ ఫుట్‌పాత్ వెంట ఉన్న తోపుడు బండిపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటాడి కారును అడ్డగించి డాక్టర్ కార్తీక్‌ను పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన డాక్టర్ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, తాను పని చేస్తున్న ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తానని చెప్పి బాధితుడిని డాక్టర్ తన కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి, ఆ వైద్యుడు పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
తోపుడు బండి పైకి దూసుకెళ్లిన కారు !
February 22, 2024
0
Tags