తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీర శంకర్

Telugu Lo Computer
0


తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీర శంకర్‌ ప్యానల్‌ విజేతగా నిలిచింది. సంఘం ప్రెసిడెంట్‌గా వీర శంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌లుగా వశిష్ఠ, సాయి రాజేశ్‌ ఎన్నికయ్యారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎలక్షన్స్‌ జరిగాయి. అనంతరం, ఫలితాలు వెలువడ్డాయి. దర్శకుల సంఘంలో దాదాపు 1500 మంది యాక్టివ్‌గా ఉన్నారని సమాచారం. తాజా ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. వీర శంకర్‌కు 536, ప్రత్యర్థి సముద్రకు 304 ఓట్లు పడ్డాయి. నూతన కార్యవర్గం రెండేళ్లు కొనసాగుతుంది. వీర శంకర్‌ గతంలోనూ అధ్యక్షుడిగా పనిచేశారు. 'హలో: ఐ లవ్‌ యూ', 'ప్రేమ కోసం', 'విజయరామరాజు', 'గుడుంబా శంకర్‌' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు వీర శంకర్‌. 'జాతి రత్నాలు', 'విరాటపర్వం' వంటి సినిమాల్లో నటించారు. 'బింబిసార'తో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన వశిష్ఠ ప్రస్తుతం.. చిరంజీవితో 'విశ్వంభర' సినిమా తెరకెక్కిస్తున్నారు. 'బేబీ'తో ఘన విజయం అందుకున్నారు సాయి రాజేశ్‌.

Post a Comment

0Comments

Post a Comment (0)