అబుధాబీలో ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ రాజధాని అబుధాబీ సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. బోచాసనవాసీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధానిని చూసేందుకు భారత పౌరులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వారికి అభివాదం తెలియజేశారు. బాలీవుడు నటుడు అక్షయ్‌ కుమార్‌, ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దుబాయ్‌ - అబుధాబీ మార్గంలోని షేక్‌ జాయెద్‌ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. యూఏఈ ప్రభుత్వమిచ్చిన 27 ఎకరాల భూమిలో 2019లో నిర్మాణాన్ని ప్రారంభించగా, రాజస్థాన్‌, గుజరాత్‌ల నుంచి వచ్చిన నిపుణులు దాదాపు మూడేళ్లు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్‌లో మరో మూడు హిందూ ఆలయాలున్నా, ప్రధాని ప్రారంభించనున్న అబుధాబీ మందిరం గల్ఫ్‌ ప్రాంతంలోకెల్లా అతి పెద్దది. అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి రెండు వైపులా భారత్‌ నుంచి భారీ కంటైనర్లలో తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమునా నదీజలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)