పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని సత్తెనపల్లిలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ దీనిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వైఎస్ షర్మిల ఒక పోస్టు పెట్టారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నది ప్రజల కోసమా లేక అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తడం కోసమా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపే వారిని గొంతు పిసికి చంపేస్తారా అని నిలదీశారు. వైసీపీ గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తారా అని  వైఎస్ షర్మిల అన్నారు. మీరు పోలీసులా లేదంటే వైసీపీ కిరాయి మనుషులా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా కొట్టడానికి హక్కు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సత్తెనపల్లి సంఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలనీ.. విచక్షణారహితంగా దాడి చేసిన సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)