తెలంగాణ వ్యాప్తంగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మరొకరు మంజా తగిలి మరణించాడు. వీరిలో ఆరుగురు హైదరాబాద్ వాసులు మృతి చెందగా, ఒకరు సంగారెడ్డి లో చనిపోయారు. హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లోని తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజశేఖర్ కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు.. గాలిపటాలు ఎగురవేస్తూ ప్రమాదవసాత్తు కిందపడి మరణించారు. జోగిపేట పట్టణంలోని రెండంతస్తుల ఇంటి టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గా పోలీసులు గుర్తించారు. గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి భవనంపై నుంచి పడిపోయాడు.. ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను విడిచాడు.. అలాగే అత్తాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్ భవనం టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో తనిష్క్ (11) మృతి చెందాడు. ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఓ అపార్ట్మెంట్ భవనం పైకప్పుపై గాలిపటాలు ఎగురవేస్తున్నాడు.. విద్యుత్ వైర్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.. అలాగే నాగోల్ లో ఓ చిన్నారి గాలి పటాలు ఎగురవేస్తూ చనిపోయాడు.
తెలంగాణ వ్యాప్తంగా గాలిపటాలు ఎగురవేస్తూ ఏడుగురు మృతి
January 16, 2024
0
Tags