తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. ప్రపంచ దేశాల సాయం కోసం పాకులాడుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్ ఇటీవల అమెరికా పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కోరుకుంటున్న ఆర్థిక సహాయం అందించాలంటే కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుందని అమెరికా స్పష్టం చేసినట్లు సమాచారం. వీటితోపాటు భారత్‌తో వాణిజ్యం, సాధ్యమైనంత త్వరగా చర్చలు జరపడం, నియంత్రణ రేఖ వద్ద శాంతియుత పరిస్థితులు నెలకొల్పడం, చైనాను కొన్ని ప్రాజెక్టులకే పరిమితం చేయాలని సూచించినట్లు తెలిసింది. 2021లో అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్-అమెరికా మధ్య సంబంధాల్లో అస్థిరత నెలకొంది. అయితే, ఇటీవల ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సాయం కోసం అమెరికా తలుపుతట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్‌తో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌కు మాత్రమే డ్రాగన్‌ను పరిమితం చేయాలని, పాకిస్థాన్‌లో ఎటువంటి చెక్‌పోస్టుల ఏర్పాటుకు చైనాను అంగీకరించవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం.
భారత్‌తో దోస్తీ చేయాలని పాకిస్థాన్‌కు అమెరికా హితబోధ !
December 19, 2023
0
Tags