అరేబియా సముద్రంలో భారత నౌకాదళం నిఘాను మరింత పెంచింది. దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు యుద్ధనౌకలను మోహరించడంతోపాటు ఇతర వ్యవస్థలను సంసిద్ధం చేసింది. భారత్కు వస్తోన్న వాణిజ్య నౌకలపై ఇటీవల దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఎంవీ రూయెన్, ఎంవీ కెమ్ ప్లూటోలపై జరిగిన దాడులు ఆందోళన కలిగించాయి. ఈ నేపథ్యంలో ఏవైనా నౌకలపై దాడులు జరిగితే వాటికి సహాయం చేసేందుకు యుద్ధనౌకలను మోహరించడంతోపాటు ఇతర వ్యవస్థలను సిద్ధం చేసినట్లు భారత నౌకదళం వెల్లడించింది.
అరేబియా సముద్రంలో యుద్ధనౌకలను మోహరించిన భారత్
December 31, 2023
0
Tags